Tuesday 23 August 2011

మరీ ఇంతనా ?

జీవితం లో అన్నింటి కన్నా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎవరికి అంటే ముందు శ్రీను కే. తను పడ్డ భాధలు, కష్టాలు, ఇబ్బందులు మై గాడ్..! ఒక సారి తన జాతక చక్రం చూపిస్తే, ఆల్రేడీ చనిపోయిన వారి జాతకం తెస్తావా ? అని కొట్టినంత పని చేసారు. అమ్మ, నాన్న, తమ్ముడు, తన కళ్ళ జోడు, వీటికే తను ఋణపడి ఉంటాడు. ఆ ఋణం తను పోయినా తీరేది కాదు. మళ్ళీ జన్మంటూ ఉంటే తమ్ముడికి తమ్ముడినై పుట్టి కొంతవరకైనా ఋణం తీర్చుకుంటా...
అరే...! మరీ ఇన్ని కష్టాలా ? దేవుడి తో సంవాదం వేయాలనుంది.