Monday, 11 April 2011

చిన్నప్పటి  జ్ఞాపకాలు కొన్ని ఇంకా గుర్తునాయి. అమ్మమ్మ ఉన్నప్పటి రోజులే వేరు. దాదాపుగా 20 ఏళ్ల తర్వాత అంటే చిన్నన్నయ్య తర్వాత మళ్ళీ మగపిల్లాడు పుట్టడంతో అందరు చాలా సంతోషించారు. కాని అష్టమి నాడు పుట్టడంతో మేనమామలకు ఏమైనా సమస్యలేమో అనుకున్నారు. అలాంటిదేమీ లేదు. విశ్వనాధం మామయ్య తొలిసారిగా వేరుపడ్డాక అరక తోలుకొని పోతుంటే ఉయ్యాలలో ఉన్న నేను తుమ్మానంట. అందరు బయపడ్డారు. కాని మామయ్య చాలా హాపీ గా ఉన్నాడు. అసలు అందరిలోకి ఆయనే చాలా క్లోజ్. బాడ్ లక్ అందరిలో ముందు ఆయనే పోయారు.

No comments:

Post a Comment