Wednesday 30 November 2011

గర్ల్ ఫ్రెండ్ ఉండక పోవడం వల్ల వచ్చే లాభాలు :


 1. టైం కు చచ్చినట్టు ఎక్కడున్నా కలిసి తీరాలి.
 2. అంతకన్నా మనకు ఇంపర్టెంటు పనులున్నా అవన్నీ తర్వాత ప్రిఫరెన్సులుగా     
       పెట్టుకోవాలి.
 3. మనసు టెన్షన్ గా ఉండదు.
 4. అర్ధరాత్రి  వరకు ఫోన్ కాల్స్ అటెండ్ చేయాల్సిన పని లేదు.
 5. తొక్కలో smsలు ఇవ్వాల్సిన పని లేదు. చూడాల్సిన పని లేదు
 6. పబ్లిక్ ప్లేస్ లో తన కోసం గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పని లేదు.
 7. మిస్ కాల్స్ గొడవ ఉండదు.
 8. పోన్ బిల్స్ గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు.
 9. నెట్ లో చాటింగ్ పని ఉండదు.
10. గిఫ్టులు, గ్రీటింగ్ కార్డ్ లు కొనాల్సిన పని లేదు.
11. బండి లో పెట్రోల్ మెయింటెన్ చేయక్కర్లేదు.
12. తను, తన పేరెంట్స్, తన తమ్ముళ్ళ, అన్నయ్యల, ముఖ్యంగా తన బొచ్చు కుక్క పుట్టిన రోజులు గుర్తు పెట్టుకోవాల్సిన పని లేదు.
13. తను ఉండే వీధి చివర్లో వెయిట్ చేయక్కర్లేదు.
14. తనకు నచ్చిన సీరియల్స్ మన కు కూడా నచ్చాయని చెప్పక్కర్లేదు.
15. వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్య, భావ లకు భయపడాల్సిన అవసరం లేదు.
16. జేబులో డబ్బులు మెయింటెన్ చేయక్కర్లేదు.
17. సినిమాలు, పబ్ లకు వెళ్ళక్కర్లేదు.
18. సినిమా ఖర్చులు, ఇంటర్వెల్ లో ఖర్చులు తప్పుతాయి.
19. కంటి నిండా నిద్ర పోవచ్చు.
20. బోజనం సయించక పోవడం అంటూ ఊండదు.
21. టైం కు బోజనం చేయొచ్చు
22. వాళ్ళ బంధువుల, అమ్మ, నాన్న, బ్రదర్స్ పేర్లు గుర్తు పెట్టుకోవక్కర్లేదు.
23. అనుకోకుండా ఫలాన చోటుకు రావడం లాంటి కమిట్ మెంట్స్ ఉండవు.
24. మన సర్కిల్ లో మన ఫ్రెండ్స్ ని మిస్సవుతున్నామన్న ఫీలింగ్ రాదు.
25. తనింట్లో వాళ్ళకోసం సినిమా cd లు చెసి ఇవ్వక్కర్లేదు.
26. అనవసరపు సెలవులు పెట్టక్కర్లేదు.
27. టిఫిన్ గాని, బోజనం గాని ఇద్దరు తిని బిల్లుమాత్రం మనం పే చేయక్కర్లేదు.
28. ఇంట్లో అబద్దాలు చెప్పాల్సిన పని లేదు.
29. ఇంట్లో పనులు వాయిదా వేయక్కర్లేదు.
30. ప్రతి పందక్కి, ప్రతి అకేషన్ కి విషెస్ చెప్పక్కర్లేదు.
31. ప్రతి రోజు ఫోన్లు, మెస్సెజ్ లు పంపక్కర్లేదు.
32. హాయిగా రోడ్దు మీద టైం పాస్ గా నడుచుకుంటూ వెళ్ళొచ్చు.
33. ఆమె కు నచ్చిన డ్రెస్ ఆమె కు మనం కొనివ్వక్కర్లేదు
34. ఆమె కు నచ్చిన డ్రెస్ మనకు నచ్చకపోయినా మనకోసం మనం కొనక్కర్లేదు.
35. రోజు నీట్ గా షేవ్ చేసుకోవాల్సిన పని లేదు
36. ఆమె కు ఇంకెవరైనా బోయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని జుట్టు పీక్కోవాల్సిన పని లేదు.
37. తన ద్రుష్టి లో లిఫ్టు బోయ్ గా మిగిలిపోవాల్సిన పని లేదు.
38. ఇంతా ఒక వేళ చేసి రేపు ఇంకొకడు బెస్ట్ ఛాయిస్ అని మా వాళ్ళు నిన్ను ఒప్పుకోవడం లేదని హాండిస్తే దేవదాసులం కావక్కర్లేదు.
39. ఆమె వేసుకున్న చండాలపు డ్రెస్ ని మాచింగ్ లని మెచ్చుకోవాల్సిన పని లేదు.
40. బైక్ బదులు సైకిల్ వాడుకోవచ్చు. దీని వల్ల ఆరోగ్యం బావుంటుంది.
41. లేట్ నైట్స్ మేలుకొని ఉండకపోవడం వల్ల మార్నింగ్ ఎర్లీగా లేవొచ్చు.
42. ఎర్లీ గా లేవడం వల్ల యోగా, చిన్న చిన్న ఎక్సర్సైజ్ లు చేయొచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం. టెన్షన్ ఫ్రీ.
43. ఫస్ట్ పరిచయమైన రోజు గుర్తు పెట్టుకోవాల్సిన పని లేదు.
44. అలిగినపుడు ప్రసన్నం చేసుకోవాల్సిన పని లేదు.

45. ప్రతి దానికి తనతో విమర్శలు ఫేస్ చేయక్కర్లేదు.
46. వెయిటింగ్ లో మనం బోర్ ఫీలయినా ఫర్వాలేదు. తను మాత్రం పీలవ్వకూడదని అనుకుంటుంది.
47. తనని మిస్ అండర్ స్టాండ్ చేసుకుంటే వెంటనే సారీ చెప్పాలి.
48. పబ్లిక్ ప్లేస్ లో తను కారణంగానైనా ఏడ్చినా అందరూ మనని అపార్ధం చేసుకునే ప్రమాదం ఉంది.
49. ఆమె ఆవేశం లో మాట్లాడుతున్నప్పుడు మనం కామ్ గా ఉండాలి.
50. తను వచ్చే టైం మాత్రమే టైం. లేటయిందని మనం ఫీలవ్వగూడదు. అడిగితే అంతే. ఇంట్లో ఎంత మానేజ్ చేయల్సొచ్చిందో  చెప్పడం మొదలు పెడుతుంది.

1 comment:

  1. its a nice information blog
    The one and the only news website portal Telugu vilas .
    please visit our website for more news updates..
    Telugu vilas

    ReplyDelete